- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mirjaguda accident: మీర్జాగూడ ప్రమాదంలో గుండెలు పగిలే దృశ్యం
రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో సోమవారం తెల్లవారుజామున జరిగిన భారీ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అతి వేగంగా వచ్చిన టిప్పర్ లారీ బస్సును ఢీ కొట్టింది.

దిశ, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ (Mirjaguda)లో సోమవారం తెల్లవారుజామున జరిగిన భారీ ప్రమాదం (major accident)లో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అతి వేగంగా వచ్చిన టిప్పర్ లారీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు సగబాగం నుజ్జు నుజ్జు కాగా.. టిప్పర్ లారీలోని కంకర బస్సులో నిండిపోయింది. దీంతో ప్రమాదం తీవ్ర భారీగా పెరిగి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి.
ఈ దారుణ ఘటనలో గుండెలు పగిలే దృశ్యం (Heartbreaking scene) కనిపించింది. 15 నెలల పాపను తన ఒడిలోనే ఉంచుకున్న తల్లి ప్రాణాలు కోల్పోయింది. అలాగే తల్లి ఒడిలో ఉన్న 15 నెలల పాప కూడా ప్రాణాలు కోల్పోయింది. దీంతో తల్లి బిడ్డను చూసిన స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు. తల్లి, 15 నెలల పాప మృతదేహాలను చూసి తోటి ప్రయాణికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పటి వరకు ప్రశాంతంగా సాగిన వారి ప్రయాణం ఒక్కసారిగా కల్లోలంగా మారింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం విషాద చాయలతో నిండిపోయింది.
Read More..
మీర్జాగూడ ప్రమాదంలో 17కి చెరిన మృతుల సంఖ్య.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ.. ఏకంగా 15 మంది దుర్మరణం






