- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బరువెక్కిన గుండెలతోనే మృతదేహాన్ని మోస్తూ.. ఎంజీఎంలో హృదయ విదారక ఘటన
ఖమ్మం జిల్లాకు చెందిన కాంతారావు అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఎంజీఎంకు తరలించారు. అయితే శుక్రవారం సాయంత్రం కాంతారావు మరణించడంతో మృతదేహాన్ని బయటకు తీసుకువెళ్లేందుకు సిబ్బంది నారాకరించారు. స్ట్రెచర్ అడిగినా అది కూడా ఇవ్వలేదు. దీంతో చేసేది లేక శోకసంద్రంలో మునిగిన ఆ కుటుంబ సభ్యులే తమ చేతుల మీదుగా డెడ్ బాడీని తీసుకువెళ్లి అంబులెన్స్‌లో ఎక్కించారు.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని పెద్ద ప్రభుత్వాసుపత్రుల్లో వరంగల్ ఎంజీఎం కూడా ఒకటి. ఇక్కడకు తరచూ వందల సంఖ్యలో పేషంట్లు వస్తుంటారు. ఇక్కడ ట్రీట్మెంట్ విషయం పక్కన పెడితే ఎప్పుడూ సమస్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఎంజీఎంలో హృదయ విదారక ఘటన అనే శీర్షిక పేపర్లలో కనిపిస్తూనే ఉంటుంది. చిన్నారులను ఎలుకలు కరవడం, ఎమర్జెన్సీ వార్డుల్లో కరెంట్ పోవడం, డాక్టర్లు అందుబాటులో లేకపోవడం ఇలా తరచూ ఏదో ఒక సమస్యతో పేషెంట్లు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇక తాజాగా అలాంటి మరో హృదయ విదారక ఘటన ఆస్పత్రిలో చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్లేందుకు సిబ్బంది నిరాకరించడంతో కుటుంబ సభ్యులే తమ చేతుల మీదుగా శవాన్ని మోసుకుని వెళ్లే పరిస్థితి వచ్చింది.
ఖమ్మం జిల్లాకు చెందిన కాంతారావు అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఎంజీఎంకు తరలించారు. అయితే శుక్రవారం సాయంత్రం కాంతారావు మరణించడంతో మృతదేహాన్ని బయటకు తీసుకువెళ్లేందుకు సిబ్బంది నారాకరించారు. స్ట్రెచర్ అడిగినా అది కూడా ఇవ్వలేదు. దీంతో చేసేది లేక శోకసంద్రంలో మునిగిన ఆ కుటుంబ సభ్యులే తమ చేతుల మీదుగా డెడ్ బాడీని తీసుకువెళ్లి అంబులెన్స్‌లో ఎక్కించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
సమస్యల వలయంలో ఎంజీఎం
ఇక తెలంగాణలోని అతిపెద్ద ప్రభుత్వాస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎంకు ఉమ్మడి వరంగల్ తో పాటు, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం నుండి సైతం పేషెంట్లు వస్తుంటారు. అలాంటి ఆస్పత్రి సమస్యల వలయంలో ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ లు వినిపిస్తున్నాయి.






