ఆరోగ్య శ్రీ కింద చేసిన గుండె మార్పిడి ఆపరేషన్ సక్సెస్.. ఆరోగ్యశాఖ మంత్రి ట్వీట్

by Ramesh Goud |

ఆరోగ్య శ్రీ (Arogya Sri) కింద చేసిన గుండె మార్పిడి ఆపరేషన్ (Heart Transplant Operation) సక్సెస్ (Success) అయ్యిందని, గుండె జబ్బుతో బాధపడుతున్న యువకుడికి, నిమ్స్ డాక్టర్లు (Nims Doctors) పునర్జన్మను ప్రసాదించారని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Raja Narsimha) అన్నారు.

ఆరోగ్య శ్రీ కింద చేసిన గుండె మార్పిడి ఆపరేషన్ సక్సెస్.. ఆరోగ్యశాఖ మంత్రి ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ఆరోగ్య శ్రీ (Arogya Sri) కింద చేసిన గుండె మార్పిడి ఆపరేషన్ (Heart Transplant Operation) సక్సెస్ (Success) అయ్యిందని, గుండె జబ్బుతో బాధపడుతున్న యువకుడికి, నిమ్స్ డాక్టర్లు (Nims Doctors) పునర్జన్మను ప్రసాదించారని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Raja Narsimha) అన్నారు. హైదరాబాద్‌లోని కాటేదాన్‌కు చెందిన పూజారి అనిల్‌కుమార్ కొంత కాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. నిమ్స్‌ హాస్పిటల్‌లో (Nims Hospital) హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం జీవన్‌దాన్‌లో రిజిస్టర్ చేసుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడు, హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు రావడంతో ఆ యువకుని హార్ట్‌ను నిమ్స్‌కు తరలించారు.

డాక్టర్ అమరేశ్‌ బాబు (Dr. Amaresh Babu) నేతృత్వంలోని టీమ్‌ అనిల్ కుమార్ కు ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా అవయవ మార్పిడి ఆపరేషన్ చేసి గుండెను అమర్చడంతో అతడు కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ బీరప్ప (Nims Director Beerappa) ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. నిమ్స్ డాక్టర్లు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. అవయవమార్పిడి శస్త్రచికిత్స తర్వాత కూడా పేషెంట్ల బాగోగులను పర్యవేక్షించాలని, వారికి అవసరమైన వైద్య సేవలను కొనసాగించాలని సూచించారు. అలాగే నిమ్స్‌లో ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలను మరింత విస్తరించాలని, ఇందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గాంధీ హాస్పిటల్‌లో త్వరలోనే అధునాతన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్‌‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. యువకుడికి గుండెను దానం చేసిన డోనర్ కుటుంబ సభ్యులను మంత్రి అభినందించారు.

అంతేగాక కొడుకును పోగొట్టుకుని పుట్టెడు దుఖంలో ఉండి కూడా, అతని అవయవాలు దానం చేసి మరో నలుగురికి ప్రాణం పోశారని ప్రశంసించారు. బ్రెయిన్ డెత్ కేసుల్లో అవయవదానానికి ముందుకు వచ్చి, ప్రాణదాతలుగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అవయవదానం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, ఇందుకోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జీవన్‌దాన్ ఇంచార్జ్‌, డాక్టర్ భూషణ్ రాజుకు సూచించారు. అవయవ మార్పిడి విషయంలో అవకతవకలకు పాల్పడే ప్రైవేటు హాస్పిటళ్లపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. అవయవదానానికి సంబంధించిన కొత్త నిబంధనలను అమలు చేయబోతున్నామని తెలియజేశారు. అవయవాల అక్రమ రవాణా, సేకరణ, మార్పిడికి కఠిన శిక్షలు పడేలా కొత్త నిబంధనలు ఉండబోతున్నాయని మంత్రి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

Next Story