- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ, రేపు జరగాల్సిన విచారణ వాయిదా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అనర్హత ఎమ్మెల్యేల వేటు అంశంపై విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అనర్హత ఎమ్మెల్యేల వేటు అంశంపై విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకొవాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. మూడు నెలల్లో చర్యలు తీసుకొవాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన స్పీకర్ ఒక్కొక్కరిగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ, రేపు జరగాల్సిన విచారణను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ విచారణలను ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు సమాచారం అందుతుంది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు తెల్లం వెంకట్రావు, సంజయ్‌ల పిటిషన్లపై రెండోసారి విచారణ జరగాల్సి ఉంది.
అలాగే 13న పోచారం, అరికెపూడి గాంధీ ను మరోసారి విచారించాల్సి ఉండగా.. వాయిదా వేశారు. ఇదిలా ఉంటే మూడు నెలల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించగా.. స్పీకర్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడారని ఆరోపిస్తూ.. బీఆర్ఎస్ నేతలు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్ పై విచారణకు కోర్టు అంగీకరించింది. మరో పక్క.. ఎమ్మెల్యేల అనర్హతపై విచారణకు మరికొంత సమయం కావాలని కోరుతూ స్పీకర్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. స్పీకర్ పిటిషన్ పై విచారణకు అంగీకరించి కోర్టు ఈ నెల 14న విచారణను షెడ్యూల్ చేసింది. అలాగే స్పీకర్ పై దాఖలైన కోర్టు దిక్కరణ కేసు పై వచ్చే సోమవారం విచారించనున్న విషయం తెలిసిందే.






