స్పీకర్ ఛాంబర్‌లో అనర్హత పిటిషన్ల విచారణ ప్రారంభం.. నేటి నుంచి అసెంబ్లీ పరిసరాల్లో పోలీస్ ఆంక్షలు

by Ramesh Naini |

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్‌లో శుక్రవారం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ల విచారణ ప్రారంభం అయింది.

స్పీకర్ ఛాంబర్‌లో అనర్హత పిటిషన్ల విచారణ ప్రారంభం.. నేటి నుంచి అసెంబ్లీ పరిసరాల్లో పోలీస్ ఆంక్షలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్‌లో శుక్రవారం (Party defections) ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ల విచారణ ప్రారంభం అయింది. మొదటగా టి.ప్రకాశ్ గౌడ్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌పై స్పీకర్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఇవాళ్టితో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి అవుతుంది. ఉదయం 11 గంటలకు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టి.ప్రకాశ్ గౌడ్, మధ్యాహ్నం 12 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య, మధ్యాహ్నం 2 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేసుల విచారణ కొనసాగించారు.

ప్రతి కేసులో ఇరువర్గాలు స్పీకర్ ముందు వాదనలు వినిపించారు. ఇప్పటికే ఇరువర్గాలు తమ ఆధారాలు, అఫిడవిట్లు స్పీకర్‌కు సమర్పించారు. ఈ విచారణల నేపథ్యంలో ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు అసెంబ్లీ పరిసరాల్లో పోలీసు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

Next Story