Defecting MLAs : ఇవాళ సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విచారణ

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-25 05:09:18  IST  )

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల(Defecting MLAs)కు ఈ రోజు టెన్షన్ డే(Tension Day)గా మారింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు(Supreme Court)లో కీలక విచారణ జరుగనున్న నేపధ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఉత్కంఠ నెలకొంది. జస్టిస్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం అనర్హత పిటిషన్లపై కీలక విచారణ చేపట్టనుంది

Defecting MLAs : ఇవాళ సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విచారణ
X

దిశ, వెబ్ డెస్క్ : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల(Defecting MLAs)కు ఈ రోజు టెన్షన్ డే(Tension Day)గా మారింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు(Supreme Court)లో కీలక విచారణ జరుగనున్న నేపధ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఉత్కంఠ నెలకొంది. జస్టిస్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం అనర్హత పిటిషన్లపై కీలక విచారణ చేపట్టనుంది. గతంలో పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద కలిసి పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై పిటిషన్‌ వేయగా.. మరో ఏడుగురి పేర్లను జత చేసి కేటీఆర్‌ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు పిటిషన్లను జత చేసి సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.

ఇప్పటికే పలుమార్లు విచారించిన అత్యున్నత ధర్మాసనం గత విచారణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని స్పీకర్ తరుపు న్యాయవాదిని ప్రశ్నించడంతో నేటి విచారణ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో టెన్షన్ రేపుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలకు ఎంత సమయం కావాలని శాసనసభ కార్యదర్శిని ధర్మాసం ప్రశ్నించింది. గత విచారణ సమయంలో రీజినబుల్‌ టైం అంటే ఏంటి.. పది నెలలు రీజనబుల్ టైం కాదా అని ధర్మాసనం ప్రశ్నించింది.

సరైన సమయం అంటే ఈ ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా? అని అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే 10 నెలలు గడిచిపోయాయని... స్పీకర్ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పీకర్ సమయం నిర్దేశించకుంటే... తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ అంశంపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ కీలకంగా మారింది. గత విచారణలలో స్పీకర్ తరుపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. బీఆర్‌ఎస్ పార్టీ తరపున ఆర్యం నామసుందరం వాదనలు వినిపించారు.

ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి దాదాపు 10 నెలలు అవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని... వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోర్టు ముందు బీఆర్‌ఎస్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు సీరియస్ గా ఉన్నట్లుగా నెలకొన్న ప్రచారం వారిని కలవరపెడుతోంది. ఏ క్షణమైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందన్న వార్తలు ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్నాయి.

ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్న నేపథ్యంలో నేటి విచారణ ఎలా సాగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిలో అరికెపూడి గాంధీ, పరిగి శ్రీనివాస్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య, కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ఉన్నారు.

Next Story