- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ మార్చి 20కి వాయిదా
బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్(Congress) పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత(MLAs' Disqualification)పై అనర్హతపై ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul)వేసిన పిటిషన్(Petition) తదుపరి విచారణను హైకోర్టు(High Court) మార్చి 20వ తేదీకి వాయిదా వేసింది.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్(Congress) పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత(MLAs' Disqualification)పై అనర్హతపై ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul)వేసిన పిటిషన్(Petition) తదుపరి విచారణను హైకోర్టు(High Court) మార్చి 20వ తేదీకి వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీజే ధర్మాసనం పిటిషన్ ను విచారణ చేపట్టింది. దీనిపై ఎమ్మెల్యేలు కౌంటర్లు దాఖలు చేశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ తీర్మానాల ఓటింగ్ లో పాల్గొనకుండా ఆదేశించాలని కేఏ పాల్ వాదించారు. కౌంటర్లపై తుది వాదనలను వినిపించడానికి విచారణను మార్చి 20కి వాయిదా వేస్తున్నట్లుగా హైకోర్టు తెలిపింది.
మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో తాజాగా బీఆర్ఎస్ రెండు పిటిషన్లు దాఖలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీలు వెంటనే చర్యలు తీసుకునేలా, టైం ఫిక్స్ చేసేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని, దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన బీఆర్ఎస్ పార్టీ మిగతా ఏడు గురు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్, అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
హైకోర్టు తీర్పు ఇచ్చి ఆరు నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని, కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ సుప్రీం కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం మరోసారి రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.






