- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి సబిత పిటిషన్‌పై వచ్చే వారం విచారణ..
by Vinod kumar |
ఓబుళాపురం మైనింగ్ కేసు నుంచి తన పేరు తప్పిచాలాంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై వచ్చే శుక్రవారం వాదనలు జరుగనున్నాయి.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: ఓబుళాపురం మైనింగ్ కేసు నుంచి తన పేరు తప్పిచాలాంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై వచ్చే శుక్రవారం వాదనలు జరుగనున్నాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద గతంలో సీబీఐ అక్రమాస్తుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఓబుళాపురం మైనింగ్ కంపెనీ మీద కూడా కేసులు పెట్టారు.
దీంట్లో జగన్మోహన్ రెడ్డితో పాటు అప్పట్లో గనుల శాఖ మంత్రి గా ఉన్న సబితా ఇంద్రారెడ్డి తో పాటు ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మీ తదితరులను నిందితులుగా చేర్చారు. కాగా, ఈ కేసు నుంచి తన పేరు తొలగించాలని సబితా ఇంద్రారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది శుక్రవారం జడ్జి ముందుకు వచ్చింది. అయితే తమ వాదనలను వచ్చే శుక్రవారం వినిపిస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది.
Next Story






