సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-13 15:54:07  IST  )

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసును కొట్టివేయాలని సీఎం రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.

సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
X

దిశ, వెబ్ డెస్క్:గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసును కొట్టివేయాలని సీఎం రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. 9ఏళ్ల క్రితం గచ్చిబౌలిలోని వివాదాస్పద భూమిలో ఉన్న సొసైటీ గదిని జేసీబీతో కూల్చివేశారని సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, లక్ష్మణ్ పై పెద్దిరాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ కేసును కొట్టివేయాలని సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కేసును విచారించి హైకోర్టు పెద్దిరాజుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది.

Next Story