- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాల ఆస్తుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ
తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజనపై ఏపీ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజనపై ఏపీ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లలో పొందు పరిచిన హక్కులతో పాటు విభజన అనంతరం తమకు దక్కాల్సిన ప్రయోజనాలను రక్షించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు సమానంగా, న్యాయమైన పద్ధతిలో వేగంగా ఆస్తులు, అప్పులను విభజించాలని కోరింది. విచారణ జరిపిన ధర్మాసనం ప్రతివాదులకు ముందుగానే పిటిషన్ కాపీలు అందించాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదికి ఆదేశించింది. కేసులో తదుపరి విచారణ జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.
Also Read:
జనవరి 1 వరకు ఎలాంటి బెంచ్‌లు ఉండవు: CJI DY Chandrachud
Next Story






