మెడికల్ పీజీ ప్రవేశాలపై హై కోర్టులో విచారణ

by Naga Rani Yarlagadda |

పీజీ మెడికల్ విద్యార్ధులకు స్థానికత పేరుతో అడ్మిషన్లను నిరాకరిచడం రాష్ట్రపతి ఉత్తర్వు 1974ను ఉల్లఘీంచడం అవుతుందని, పిటిషనర్లను స్థానిక అభ్యర్ధులుగా పరిగణించాలని హై కోర్టు తెలిపింది.

మెడికల్ పీజీ ప్రవేశాలపై హై కోర్టులో విచారణ
X
  • మూడు వారాల్లో కాళోజీ మెడికల్ యూనివర్సిటీ కౌంటర్ దాఖలు చేయాలి
  • నవంబర్ 11న పిటిషనర్లు కౌంటర్ దాఖలు చేయాలని హై కోర్టు ఆదేశాలు..

దిశ, తెలంగాణ బ్యూరో: పీజీ మెడికల్ విద్యార్ధులకు స్థానికత పేరుతో అడ్మిషన్లను నిరాకరిచడం రాష్ట్రపతి ఉత్తర్వు 1974ను ఉల్లఘీంచడం అవుతుందని, పిటిషనర్లను స్థానిక అభ్యర్ధులుగా పరిగణించాలని హై కోర్టు తెలిపింది. కాళోజీ నారాయణరావు మెడికల్ కాలేజి పీజీ అడ్మిషన్ల పై దాఖలైన పిటిషన్లపై హై కోర్టులో బుధవారం విచారణ జరిగింది. హైకోర్టు ఛీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్, జస్టిస్ మోహియిద్దిన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 62 మంది అభ్యర్థులు పీజీ మెడికల్ విద్యార్ధులు అడ్మిషన్లకు ఎదురు చూస్తున్నారని పిటిషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ విద్యాసాగర్, లెర్నెడ్ కౌన్సిల్ సాయి ప్రసేన్ హై కోర్టుకు వివరించారు. పిటిషనర్లు తెలంగాణ రాష్ట్రంలోని వైద్య సంస్థలలలో ఎంబీబీఎస్ కోర్సును చదివారని కానీ స్థానికేతర అభ్యర్థులుగా చేరారని సమర్పించారు. సెప్టెంబర్ 30నాటి నోటిఫికేషన్ ప్రకారం 2025–26 విద్యా సంవత్సరానికి స్థానికేతర కోటా కింద అనర్హులుగా ప్రకటించబడ్డారని వివరించారు. హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వేల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపున అసిస్టెంట్ జీపీ రమేష్, హజరయ్యారు. కాళోజీ నారాయణ రావు యూనివర్సీటి ఆఫ్ హెల్త్ సైన్స్ తరపున స్టాడింగ్ కౌన్సిల్ శరత్ వాదనలు వినిపించారు. మెడికల్ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియ పై మూడు వారాల్లోగా కాళోజి మెడికల్ యూనివర్సిటీ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. నవంబర్ 11న పిటిషనర్లు కౌంటర్ దాఖలు చేయాలని తెలుపుతూ తదుపరి విచారణ అదే తేదికి వాయిదా వేసింది.

Next Story