సీఎం మీడియా సమావేశం సీడీలు ఎక్కడివి?

by Disha Web Desk |
సీఎం మీడియా సమావేశం సీడీలు ఎక్కడివి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంలో మధ్యంతర పిటిషన్లపై శుక్రవారం ఉదయం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఫామ్ హౌస్ వీడియోలను సీఎం మీడియా సమావేశంలో బయట పెట్టడంపై పిటిషనర్లు మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫామ్ హౌస్ వీడియోలు, కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోలను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీడియా సమావేశానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎక్కడి నుండి తీసుకున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఇక పిటిషనర్స్ సమర్పించిన ఎలక్ట్రానిక్ డివైసెస్ పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ సమర్పించినప్పుడు 65 బి ఎవిడెన్స్ యాక్ట్ కింద సర్టిఫికెట్ ఎందుకు సమర్పించలేదని సిట్ తరపు న్యాయవాది వాదించారు. దీంతో తమకు కొంత గడువు కావాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు న్యాయస్థానం సమయం ఇచ్చింది. అనంతరం కేసు తదుపరి విచారణ ఇవాళ సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.

Also Read....

ప్రభుత్వానికి Governor Tamilisai సూచన!



Next Story

Most Viewed