నిర్లక్ష్యం వద్దు.. డెడ్ లైన్ పెట్టుకుని పని చేయాలి: అధికారులకు మంత్రి ఆదేశం

by Gantepaka Srikanth |

సనత్‌నగర్, అల్వాల్, కొత్తపేట టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha) సమీక్ష సమావేశం నిర్వహించారు.

నిర్లక్ష్యం వద్దు.. డెడ్ లైన్ పెట్టుకుని పని చేయాలి: అధికారులకు మంత్రి ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: సనత్‌నగర్, అల్వాల్, కొత్తపేట టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో‌ ఆరోగ్యశాఖ సెక్రటరీతో పాటు, ఆ శాఖ ఇతర ఉన్నతాధికారులు, ఆర్ అండ్ బీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది చివరికల్లా హాస్పిటళ్లను ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించిన నేపథ్యంలో, పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. హాస్పిటళ్ల సివిల్ వర్క్స్, ఎక్విప్‌మెంట్, డాక్టర్లు, సిబ్బంది నియామకం తదితర అంశాలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.

డెడ్ లైన్ పెట్టుకుని పని చేయాలి: మంత్రి

ఒక టైమ్‌లైన్ పెట్టుకుని అందరూ సమన్వయంతో పని చేయాలని, నిర్ణీత సమయంలో అన్ని పనులూ పూర్తి చేయాలని మంత్రి సూచించారు. హాస్పిటళ్లు ప్రారంభించిన రోజు నుండే వైద్య సేవలు అందుబాటులోకి రావాలని అధికారులను ఆదేశించారు. ఈ నాలుగు హాస్పిటళ్ల కోసం అధునాతన ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేయాలని సూచించారు. ఎక్విప్‌మెంట్ కొనుగోలులో సంబంధిత డాక్టర్లు, టెక్నికల్ ఎక్స్‌పర్టుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

Next Story