10 లక్షల 70 వేల మందికి ‘ఆరోగ్యశ్రీ’ సేవలు.. హాస్పిటల్స్ యాజమాన్యాలకు ఆరోగ్య మంత్రి విషెస్

by Ramesh Naini |

తెలంగాణలోని హాస్పిటల్స్‌ 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 10 లక్షల 70 వేల మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందించాయి.

10 లక్షల 70 వేల మందికి ‘ఆరోగ్యశ్రీ’ సేవలు.. హాస్పిటల్స్ యాజమాన్యాలకు ఆరోగ్య మంత్రి విషెస్
X

దిశ, తెలంగాణ బ్యూరో / డైనమిక్ బ్యూరో : తెలంగాణలోని హాస్పిటల్స్‌ 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 10 లక్షల 70 వేల మందికి ఆరోగ్యశ్రీ (Aarogyasri) సేవలు అందించాయి. ప్రభుత్వానికి సహకరిస్తూ ఆరోగ్యశ్రీ పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలకు ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు రేవంత్ సర్కార్ పెంచింది. మంత్రి దామోదర రాజనర్సింహ కృషితో సుమారు దశాబ్ద కాలం తర్వాత ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను ప్రభుత్వం సవరించింది. సగటున 22 శాతం మేర పెరిగిన చార్జీలు.. ప్రతి నెలా హాస్పిటళ్లకు బిల్లుల చెల్లింపు జరిగాయి. దీంతో ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లకు చికిత్స అందించడానికి ప్రైవేట్ హాస్పిటళ్లు ఆసక్తి చూపిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. గడిచిన 20 నెల్లలో 10.72 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందాయని వెల్లడించారు. నెట్‌వర్క్‌ హాస్పిటళ్లకు రూ.1590 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లించినట్లు తెలిపారు. దీంతో ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌మెంట్ కోసం పోటీ పెరిగినట్లు వివరించారు. కొత్తగా ఆరోగ్యశ్రీలో వందకుపైగా ప్రైవేటు హాస్పిటల్స్‌ చేరాయని, మొత్తంగా 461 ప్రైవేటు- కార్పొరేట్ హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.

Next Story