- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.. కల్తీ కల్లు బాధితులకు ఆరోగ్య మంత్రి పరామర్శ
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి మొత్తం 37 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Toddy Adulteration) హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి మొత్తం 37 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కల్తీ కల్లు బాధితులను గురువారం నిమ్స్‌లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Health Minister Damodar Rajanarsimha) పరామర్శించారు. డాక్టర్లను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడారు. 31 మంది నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అందరూ స్టేబుల్‌గా ఉన్నారని వెల్లడించారు. ఒక నలుగురికి డయాలసిస్ చేస్తున్నారని అన్నారు.
ఒక నాలుగైదు రోజుల్లో అందరూ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఘటనపై పూర్తిస్థాయిలో ప్రభుత్వం విచారణ చేయిస్తోందని, ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 7 కి చేరినట్లు సమాచారం. మరో బాధితురాలు నర్సమ్మ (54) ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.






