వెల్‌నెస్ సెంటర్లపై ఆరోగ్య మంత్రి ఆగ్రహం.. మెడిసిన్స్, అటెండెన్స్‌, అక్రమాలపై ఆరా

by Ramesh Naini |

వెల్‌నెస్ సెంటర్లపై ఆరోగ్య మంత్రి ఆగ్రహం.. మెడిసిన్స్, అటెండెన్స్‌, అక్రమాలపై ఆరా
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఉద్యోగులు, జర్నలిస్ట్‌లు, పెన్షనర్ల ఆరోగ్య అవసరాల కోసం ఏర్పాటు చేసిన వెల్‌నెస్ సెంటర్లు (wellness centers) అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఖరీదైన మందులు తెప్పించి బయట విక్రయిస్తున్నట్లు తీవ్ర పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వెల్‌నెస్ సెంటర్లపై వస్తున్న వార్తల విషయంలో అధికారులపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Health Minister Damodar Rajanarsimha) ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో వెల్‌నెస్ సెంటర్లలో ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు తాజాగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గత రెండు రోజులుగా ఆరోగ్యశ్రీ సీఈవో, ఇతర ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. మెడిసిన్, డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్, ఇతర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు ఈ వివరాలను ఆరోగ్య మంత్రి ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. అధికారులు తనిఖీలు చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేశారు.

Next Story