Health Minister: జర్నలిస్ట్ మునీర్ ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

by Ramesh Naini |

జర్నలిస్ట్ మునీర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వాకబు చేశారు.

Health Minister: జర్నలిస్ట్ మునీర్ ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జర్నలిస్ట్ మునీర్ (journalist Munir) ఆరోగ్య పరిస్థితిపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Health Minister Damodar Rajanarsimha) వాకబు చేశారు. మునీర్‌‌ కేన్సర్‌‌తో బాధపడుతున్నారని తెలిసి ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి, ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఒమెగా హాస్పిటల్‌లో జర్నలిస్ట్ చికిత్స పొందుతున్నారు. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఒమెగా హాస్పిటల్‌ యాజమాన్యానికి మంత్రి సూచించారు. గతంలో మునీర్‌‌గారు సింగరేణిలో పనిచేసి, వీఆర్‌‌ఎస్ తీసుకున్నారు. ప్రస్తుతం సింగరేణి సంస్థ ఆయన ట్రీట్‌మెంట్ ఖర్చులు భరిస్తోందని మునీర్ కుమారుడు మయూర్ తెలిపారు.

మునీర్‌‌ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండాలని, వారికి అవసరమైన సహాయం అందించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర ఆదేశించారు. ఈ మేరకు సోమవారం మంత్రి దామోదర రాజనర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా జర్నలిస్ట్ మునీర్ ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌‌ (KTR) ‌సైతం తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. మునీర్‌కు సాయం చేయాలని తన ఆఫీస్ టీమ్‌కు ఆదేశాలిచ్చారు.

కాగా, తెలంగాణ ఉద్యమకారుడు, సింగరేణి సకల జనుల సమ్మె కన్వీనర్, సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మునీర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన అనారోగ్యం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీమంత్రి కేటీఆర్ స్పందించాలని, మెరుగైన చికిత్స అందించేందుకు చొరవ తీసుకోవాలని పలువురు మేధావులు రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Next Story