Telangana Budget 2023 : ఆరోగ్య శాఖకు రూ. 12,161 కోట్లు

by Disha Web |
Telangana Budget 2023 : ఆరోగ్య శాఖకు రూ. 12,161 కోట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ 2023–24 బడ్జెట్‌లో రూ.12,161 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ఏడాది రూ.11237 కోట్లను కేటాయించగా,ఈ సారి అంతకంటే రూ.924 కోట్లు అదనంగా పెట్టారు. అన్ని జిల్లాలకు కేసీఆర్​ న్యూట్రిషన్ కిట్స్​విస్తరణ, ప్రభుత్వ మెడికల్​ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు మంజూరు.

అలాగే మరో 100 బస్తీ దవాఖానలు ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు మంత్రి హరీష్​రావు ప్రకటించారు. దీంతో పాటు కంటి వెలుగుకు శాశ్వత ప్రక్రియను చేసేందుకు అవసరమైన ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లు డెవలప్మెంట్‌లు, పాలియేటివ్​కేర్​వంటి కార్యక్రమాలను బలోపేతం చేయనున్నట్లు స్పస్టం చేశారు.

Read more:

తెలంగాణ బడ్జెట్ 2023: షెడ్యూల్ కులాల డెవలప్‌మెంట్‌కు కేటాయింపులివే
Next Story