- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Republic Day 2026: 15 మంది తెలంగాణ పోలీసులకు పతకాలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలకు తెలంగాణ పోలీసు ఎంపికయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలకు తెలంగాణ పోలీసు ఎంపికయ్యారు. మెడల్ ఆఫ్ గ్యాలంటరీ అవార్డులకు హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట రెడ్డి ఎంపిక అయ్యారు. రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలకు ఇద్దరు అధికారులు ఎంపికయ్యారు. అడిషినల్ ఎస్పీ మంద జీఎస్ ప్రకాష్ రావు, సబ్ ఇన్స్‌పెక్టర్ ఎ.దామోదర్ రెడ్డి ఎంపిక అయ్యారు. మెడల్ ఫర్ మెరిటేరియస్ సర్వీసెస్ అవార్డుకి 15 మంది పోలీస్ అధికారులు ఎంపిక కాగా వారిలో ఎస్ఐబీ ఐజీ సుమతికి మెడల్ ఫర్ మెరిటేరియస్ సర్వీసెస్ అవార్డు ఎంపిక అయ్యారు. హోంగార్డ్ విభాగం నుంచి ముగ్గురు, ఫైర్ విభాగం ముగ్గురు నుంచి ఎంపికయ్యారు పోలీస్, ఫైర్, హోమ్ గార్డ్ , సివిల్ డిఫెన్స్ , కరెక్షనల్ సర్వీసెస్ నుంచి అవార్డు గ్రహితలను ఎంపిక చేశారు.
మెడల్ ఆఫ్ గ్యాలంటరీ – మర్రి వెంకట రెడ్డి హెడ్ కానిస్టేబుల్
రాష్ట్రపతి విశిష్ట సేవ పతకం (ప్రెసిడెంట్ మెడల్ ఫర్ డిస్టిన్ గ్యూషుడ్ సర్వీస్)
మంద జీఎస్ ప్రకాష్ రావు అడిషినల్ ఎస్పీ
ఎ.దామోదర్ రెడ్డి సబ్ ఇన్స్ పెక్టర్
మెడల్ ఫర్ మెరిటేరియస్ సర్వీసెస్
అవార్డు గ్రహిత - హోదా
బీ. సుమతి- ఐజీ, ఎస్ఐబీ
పి.వెంకట్ రాములు -కమాండెంట్
ఎం. శంకర్- డీఎస్‌పీ
ఎ.భాను మూర్తి- సీనియర్ కమాండెంట్
కేవీఎం ప్రసాద్- డీసీపీ
సి వంశీ మోహన్ రెడ్డి- డీఎస్‌పీ
టీ.లక్ష్మి -డీఎస్‌పీ
బీ.ఎల్లయ్య- సబ్ ఇన్‌స్పెక్టర్,
వి.పురుషోత్తం రెడ్డి -సబ్ ఇన్‌స్పెక్టర్,
సయ్యద్ అబ్దుల్ కరీం -సబ్ ఇన్‌స్పెక్టర్,
బీ. ఆనందమ్ అసిస్టెంట్ -సబ్ ఇన్స్పెక్టర్,
పైలి మనోహర్- హెడ్ కానిస్టేబుల్






