- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : మాకు సున్నా అన్నాడు..ఆయన పార్టీకి సున్నానే వచ్చింది : రేవంత్ పై కేటీఆర్ సెటైర్లు
పార్లమెంటు ఎన్నికల్లో మాకు సున్నా సున్నా(Zero To Us) అని ఎగతాళి చేసిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy(పార్టీ కాంగ్రెస్(Congress) కు కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక(Delhi Assembly Elections)ల్లో గాడిద గుడ్డు సున్నా సీట్లు(His Party Got Zero)దక్కాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎద్దేవా చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : పార్లమెంటు ఎన్నికల్లో మాకు సున్నా సున్నా(Zero To Us) అని ఎగతాళి చేసిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy(పార్టీ కాంగ్రెస్(Congress) కు కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక(Delhi Assembly Elections)ల్లో గాడిద గుడ్డు సున్నా సీట్లు(His Party Got Zero)దక్కాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎద్దేవా చేశారు. ఐరల్ లెగ్ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారం చేసి కాంగ్రెస్ ను ఓడించగా..ఢిల్లీ అసెంబ్లీలో ప్రచారం చేసి విజయవంతంగా సున్నా సీట్లకు పడగొట్టాడని..ఆ పార్టీ అడుగు నాశనమై ఖతమై పీకిందన్నారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి ఎవరైన అతిపెద్ద కార్యకర్త ఎవరైనా ఉన్నారా అంటే అది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మన రేవంత్ రెడ్డి మాత్రమేనని, అందుకు రాహుల్ గాంధీకి చప్పట్లు కొట్టాలన్నారు. దేశంలో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందో అక్కడా బీజేపీని గెలిపిస్తున్నాడని రాహుల్ గాంధీపై వ్యంగ్యస్త్రాలు గుప్పించారు.
తెలంగాణ భవన్‌లో సిర్పూర్ కాగజ్‌నగర్ బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపైన ప్రజలు కోపంగా ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీ నేతలు నాయకులు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు కొట్టే పరిస్థితులున్నాయని..సీఎం రేవంత్ రెడ్డి కూడా పోలీస్ సెక్యూరిటీ లేకుండా బయట తిరిగే అవకాశం లేదన్నారు. ప్రజలు తిడుతున్న తిట్లకి రేవంత్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారన్నారు. తెలుగు భాషలో ఉన్న అన్ని తిట్లను ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారని, ఇంత దుర్మార్గమైన పాలన చేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఏమున్నదో ఆలోచించుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటల మనుషులే కానీ చేతల ప్రభుత్వం కాదని అర్థమైందన్నారు. తెలంగాణ నలుమూలలో కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా వ్యతిరేకత నెలకొని ఉందన్నారు.
రేవంత్ రెడ్డి పుణ్యమా అని తెలంగాణలో 15 ఏండ్లు కాంగ్రెస్ ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదని..కాని మనం మాత్రం గెలుస్తామంటూ ఇంట్లో పడుకుంటే మళ్లా ఎప్పటిలెక్క మోసం జరుగుతుందన్నారు. లెక్కల్లో 8+8=16 కానీ తెలంగాణలో మాత్రం 8+8=0 అని..జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు...8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచి తెలంగాణకు తెచ్చింది గుండు సున్నా అని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పినా.. ఒక్క కాంగ్రెస్, బీజేపీ ఎంపీ నోరు మెదపలేదన్నారు. కానీ లోక్‌సభలో గులాబీ దండు ఉండుంటే కేంద్రంతో కొట్లాడుతుండేనని చెప్పుకొచ్చారు. రేపు రానున్న స్థానిక సంస్థల్లో మన పార్టీ అభ్యర్థులను భారీగా గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కేటీఆర్ కోరారు.
ప్రతిపక్షంలో ఉన్న మన పార్టీతో కలిసి నడిచేందుకు ముందుకొచ్చిన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని, తెలంగాణ సమాజం గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి భవిష్యత్తు తెలంగాణ గురించి ప్రవీణ్ కుమార్ ఆలోచనలు నా ఆలోచనలు దాదాపు ఒకే రకంగా ఉన్నాయన్నారు. అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన అనేక అవకాశాలను పదవులను వదులుకొని బహుజన అభివృద్ధి కోసం మన పార్టీలో చేరడం జరిగిందని కొనియాడారు. కేసీఆర్ తోనే బహుజనుల అభివృద్ధి జరుగుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నమ్మారన్నారు. అధికారం కోసం పార్టీలు మారే అవకాశవాదుల గురించి మాట్లాడాల్సిన అవసరం, ఆలోచించాల్సిన అవసరం మనకు లేదన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన గురుకుల బాట వల్ల.. ప్రభుత్వం గురుకులాల పరిస్థితులపైన స్పందించిందన్నారు.
సిర్పూర్ కాగజ్‌నగర్‌తో నాకు వ్యక్తిగతంగా అనుబంధం ఉందని..2006 నుంచి 2009 వరకు అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిని బలోపేతం పని చేశానని, 2009లో శాసనసభ ఎన్నికల్లో పార్టీ గెలిచిందని.. రాష్ట్రంలో పది సీట్లు మాత్రమే గెలిచినా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో కూడా గులాబీ జెండా ఎగిరిందని కేటీఆర్ గుర్తు చేశారు. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో.. అక్కడ ఉన్న ఏకైక పరిశ్రమ పేపర్ మిల్లును తెరిపించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేశామని, పేపర్ మిల్లును ఓపెన్ చేసేందుకు ముంబాయి, కలకత్తా వంటి అనేక ప్రాంతాల్లో పర్యటించి అనేక కంపెనీలను కలిసి జేకేతో మాట్లాడి పేపర్ మిల్లును తిరిగి ఓపెన్ చేయించడం జరిగిందని కేటీఆర్ వెల్లడించారు. అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బుల చాటుకు పోతాడని.. కానీ మళ్ళీ ఆ మబ్బులను చీల్చుకొని బయటికి వస్తాడని.. ప్రపంచంలోని జీవరాశికి ఎప్పటిలాగే బతకడానికి మళ్లీ అవకాశం ఇస్తాడని..అట్లనే తాత్కాలికంగా మన చంద్రుడు కేసీఆర్ కూడా మబ్బుల చాటుకే పోయాడని..ప్రజల ఆశీర్వాదం , బీఆర్ఎస్ కార్యకర్తల సంకల్పబలంతో కేసీఆర్ తప్పకుండా మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని...ఇదే నేను ఇచ్చే మాట అని కేటీఆర్ అన్నారు.






