Adilabad: ఆయన ఎస్టీ కాదు.. ఆదిలాబాద్ లీడర్ కులంపై కలెక్టర్ ఉత్తర్వులు

by Prasad Jukanti |   (  Updated:2025-06-04 08:07:55  IST  )

ఆదిలాబాద్ లీడర్ కు కలెక్టర్ షాకిచ్చారు.

Adilabad: ఆయన ఎస్టీ కాదు.. ఆదిలాబాద్ లీడర్ కులంపై కలెక్టర్ ఉత్తర్వులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆదిలాబాద్ (Adilabad) జిల్లాకు చెందిన ఓ రాజకీయ నేత ఎస్టీ కాదని 35 ఏళ్ల తర్వాత జిల్లా కలెక్టర్ సంచలన ఉత్తర్వులు ఇచ్చారు. ఇచ్చోడకు చెందిన చవాన్ దేవానంద్ అనే నేత ఎస్టీ కులస్థుడు కాదని కలెక్టర్ (Collector) స్పష్టం చేశారు. 1990లో ఎస్టీ సర్టిఫికెట్ పొందిన చవాన్ దేవానంద్ (Chavan Devanand) 2014 లో ఎస్టీ రిజర్వ్ డు స్థానంలో ఎంపీటీసీగా గెలిచారు. అంతకు ముందు ఎస్టీగా 2 సార్లు ఆయన కుమార్తెలు సర్పంచ్ గా పోటీ చేసి గెలుపొందారు. అయితే దేవానంద్ కులంపై బంజారా సంఘం నేతలు ఎస్టీ (ST) కమిషన్ కు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన కమిషన్ దేవానంద్ ఎస్టీ కాదని తేల్చింది. దీంతో ఆయనకు ఉన్న ఎస్టీ హోదాను జిల్లా కలెక్టర్ రద్దు చేశారు.

Next Story