HCUలో సంబరాలు.. వర్షంలో పాటలు పాడుతూ చిందులేసిన విద్యార్థులు!

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-03 13:15:28  IST  )

HCU సమీపంలోని కంచ గ‌చ్చిబౌలి భూముల్లో జరుగుతున్న అన్ని పనులను తక్షణమే ఆపేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

HCUలో సంబరాలు.. వర్షంలో పాటలు పాడుతూ చిందులేసిన విద్యార్థులు!
X

దిశ,వెబ్‌డెస్క్: HCU సమీపంలోని కంచ గ‌చ్చిబౌలి భూముల్లో జరుగుతున్న అన్ని పనులను(చెట్ల కొట్టి వేతను) తక్షణమే ఆపేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ(Hyderabad Central University) విద్యార్థులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇన్ని రోజులు విద్యార్థులు చేసిన నిరసనలకు అనుకూలంగా సుప్రీం తీర్పు ఇవ్వడంతో హెచ్‌సీయూలో సంబరాలు హోరెత్తాయి.

ఈ సంద‌ర్భంగా ఈ రోజు(గురువారం) HCUలో విద్యార్థులు సంబరాలు అంబరాన్ని తాకాయి. విద్యార్థులంతా వర్షంలోనే పాటలు పాడుతూ, డాన్స్ లు వేస్తు సంబరాలు చేసుకున్నారు. సుప్రీం ఆదేశాలతో బీఆర్‌ఎస్ నేతలు(BRS Leaders) సైతం సోషల్ మీడియా(Social Media) వేదికగా స్పందిస్తూ.. ‘ఇది విద్యార్థుల విజయం’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడుకునేందుకు పోరాటం కొన‌సాగిస్తామ‌ని హెచ్‌సీయూ విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. కంచ గ‌చ్చిబౌలి భూముల విషయంలో సుప్రీం కోర్టు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Next Story