- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HCA Vs SRH: హెచ్సీఏ వెనుక పింక్ పార్టీ! హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే కుట్ర
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు గులాబీ లీడర్లు ఐపీఎల్‌ను ఓ అస్త్రంగా ఎంచుకున్నట్టు విమర్శలొస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు గులాబీ లీడర్లు ఐపీఎల్‌ను ఓ అస్త్రంగా ఎంచుకున్నట్టు విమర్శలొస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ గుడ్ బై చెప్పేలా క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఒత్తిళ్లు పెట్టించినట్టు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ ప్లాన్‌ను పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల వివాదంపై విచారణకు ఆదేశించింది. దీనిలో హెచ్‌సీఏ ప్రమేయం ఏ మేరకు ఉందో నివేదిక ఇవ్వాలని ఎన్ ఫోర్స్‌మెంట్ అధికారులను కోరింది. దీంతో హెచ్‌సీఏ మళ్లీ మాట మార్చినట్లు తెలిసింది. తమ ప్రతిష్టను మసకబార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎదురుదాడికి సిద్ధమైనట్టు సమాచారం.
అభాసుపాలు చేసే కుట్ర?
ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ ఉప్పల్ స్టేడియాన్ని హోం గ్రౌండ్‌గా చేసుకుని ఐపీఎల్ ఆడుతున్నది. హెచ్‌సీఏ మాత్రం గతేడాది నుంచి సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌ను ఇబ్బందులు గురిచేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక సన్‌రైజర్ యాజమాన్యం ఇతర రాష్ట్రాలకు వెళ్తే.. ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని కుట్ర పన్నినట్లు క్రీడావర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఒప్పందం ప్రకారం ప్రతి గేమ్ రోజున క్రికెట్ అసోసియేషన్‌కు 10 శాతం కాంప్లిమెంటరీ టికెట్లు ఇవ్వాలి. ఈ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా 3,900 కాంప్లిమెంటరీ టికెట్లతో పాటు 50 టికెట్ల సామర్థ్యం ఉన్న ఓ కార్పొరేట్ బాక్స్‌ను క్రికెట్ అసోసియేషన్‌కు కేటాయించారు. కానీ, ఈ ఏడాది ఆ బాక్స్ కెపాసిటీ 30కు తగ్గిందని, మరో 20 టికెట్లు ఇవ్వాలని ఆసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేసినట్టు తెలుస్తున్నది. దీనిపై కూర్చోని మాట్లాడుకుందామని సన్‌రైజర్స్ ప్రతినిధులు.. అసోసియేషన్‌కు సూచించారు. కానీ, అదేమీ పట్టించుకోకుండా అసోసియేషన్ మరో మ్యాచ్ రోజున ఓ కార్పోరేటు బాక్స్‌కు తాళం వేసి.. 20 టికెట్లు ఇస్తేనే తాళం తీస్తామని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనితో మనస్తాపం చెందిన సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ మేనేజర్ శ్రీనాథ్..ఉప్పల్ స్డేడియంలో ఆడటం ఇష్టంలేదన్నట్టుగా హెచ్‌సీఏ ప్రవర్తిసున్నదని అనిపిస్తుందని, మరో రాష్ట్రంలోని స్టేడియాన్ని హోం గ్రౌండ్ చేసుకుంటామని బీసీసీఐకి, తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది.
విచారణకు ఆదేశించిన సర్కార్
హెచ్‌సీఏ వ్యవహారశైలిని గమనించిన ప్రభుత్వం అసలు విషయాన్ని బహిర్గతం చేసేందుకు విచారణకు ఆదేశించింది. ఉచిత పాస్‌ల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)పై హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్ల వేధింపులను సర్కారు సీరియస్‌గా తీసుకున్నది.ఈ వ్యవహరంలో సీఎం రేవంత్ సోమవారం పోలీసుల అధికారులను విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించేందుకు డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కొత్తకోట శ్రీనివాస రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సన్‌రైజర్స్ యాజమాన్యంపై హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ప్రవర్తనపై ఉన్న అభ్యంతారాలు ఏమిటి? జగన్ ఎందుకు ఆలా వ్యవహరించారు? ఆయన వెనుక బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారా? అనే కోణంలో విచారించేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నట్లు టాక్.-
హెచ్‌సీఏ అధ్యక్షుడు గులాబీ పార్టీకి సన్నిహితుడు
ప్రస్తుత హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత సన్నిహితుడు. ఆ పార్టీలోని కీలక లీడర్లతో ఆయనకు చనువు ఉన్నది. అందుకే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ప్రభుత్వంలో పలు కాంట్రాక్టులను దక్కించుకుని ఆర్థికంగా ప్రయోజనం పొందారనే విమర్శలున్నాయి. వరుసగా రెండు టర్మ్‌లు ప్రభుత్వాన్ని నడిపిన గులాబీ పార్టీ రాష్ట్రంలోని అన్ని రంగాల్లో తమ అనుచరులను ఎంట్రీ చేశారని.. హెచ్‌సీఏలో ఎంట్రీకి ఇబ్బందులు వచ్చాయనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే, సహజంగా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న జగన్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు గులాబీ లీడర్లు తీవ్రంగా కృషి చేశారనే చర్చ హెచ్‌సీఏ ఎన్నికల సమయంలో జరిగింది.






