Parliament : పార్లమెంటులో HCU భూముల అంశం

by Muthe.Rajitha |

హైదరాబాద్(Hyderabad) లోని కంచె గచ్చిబౌలి భూముల అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్త చర్చ నడుస్తోంది.

Parliament : పార్లమెంటులో HCU భూముల అంశం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లోని కంచె గచ్చిబౌలి భూముల అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. హెచ్సీయూ(HCU)కు చెందిన 400 ఎకరాల భూముల వివాదాన్ని మంగళవారం బీజేపీ ఎంపీలు పార్లమెంటు(Parliament)లో ప్రస్తావించారు. రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్(BJP MP Laxman) జీరో అవర్ లో ఈ అంశాన్ని లేవనెత్తారు. తెలంగాణ ప్రభుత్వం 400 ఎకరాల వర్శిటీ భూములను అమ్ముకునేందుకు ప్రయత్నం చేస్తోందని.. దీనిని తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. టీజీఐఐసీ(TGIIC) ద్వారా ప్రభుత్వం ఆ భూములను ప్రైవేట్ సంస్థలకు అమ్ముకోవాలని చూస్తోందని.. వర్శిటీకి కేటాయించిన ఆ భూముల్లో ఎంతో విలువైన వృక్ష సంపద ఉందని, నగరానికి ఊపిరితిత్తుల వంటి అడవిని సర్వ నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

ఇదే అంశంపై లోక్ సభలో పలువురు తెలంగాణ బీజేపీ ఎంపీలు జీరో అవర్లో లేవనెత్తారు. వర్శిటీకి కేటాయించిన భూములకు మార్కింగ్ చేయాలని కేంద్రాన్ని కోరారు. అనంతరం కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆధ్వర్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, నగేష్ లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి వినతి పత్రం అందించారు. హైదరాబాద్ లోని కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల హెచ్సీయూ భూములను ప్రభుత్వం తమదేనని స్వాధీనం చేసుకోవడంతో ఈ వివాదం మొదలైంది. గతంలో ఈ భూములకుబదులుగా వేరే చోట వర్శిటీకి భూమి కేటాయించామని.. అయితే ఆ భూమి విషయంపై కోర్టులో కేసు ఉండటంతో ఇన్నాళ్ళు దానిని స్వాధీనం చేసుకోవడం కుదరలేదని ప్రభుత్వం చెబుతోంది.

Next Story