- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court : హెచ్సీయూ భూ వివాదం.. హైకోర్టులో మొదలైన విచారణ
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తున్న అంశం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం(HCU Land Dispute).

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తున్న అంశం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం(HCU Land Dispute). కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల స్థలం తమదేనంటూ ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడంతో ఈ వివాదాన్ని మరింత తీవ్ర అయింది. రాష్ట్రవ్యాప్తంగా ఏ నలుగురు గుమిగూడినా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. అయితే ఈ భూమిలో అనేక వన్యప్రాణులు, విలువైన వృక్ష సంపద ఉందని, ఆ స్థలాన్ని జాతీయ పార్కుగా ప్రకటించాలని వాటా ఫౌండేషన్(WATA Foundation) హైకోర్టు(High Court)లో ప్రజా ప్రయోజన వాజ్యం(PIL) దాఖలు చేసింది.
ఆ స్థలం జింకలు, నెమళ్లకు అవాసంగా ఉందని, ఆ భూములలో ప్రభుత్వం చేపడుతున్న భుముల వేలం నిలిపివేసి దానిని జాతీయ పార్కు(National Park)గా ప్రకటించాలని పిటిషన్ లో పేర్కోన్నారు. కాగా ఈ పిల్ పై బుధవారం హైకోర్ట్ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున లాయర్ తన వాదనలు వినిపిస్తూ.. అది ప్రభుత్వ భూమి అయినా సరే సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే పని చేయాలని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ భూమిని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ వేయాలని అన్నారు. ప్రభుత్వం ఆ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం చెట్లు కొట్టివేసి, ఆ స్థలంలో ఉన్న ఎన్నో వన్యప్రాణుల ప్రాణాలను రిస్క్ లో పెట్టిందన్నారు. ఈ వ్యవహారంపై రేపటిలోగా వివరణ ఇవ్వాలని ప్రభువ న్యాయవాదిని కోర్ట్ ఆదేసిస్తూ.. విచారణ రేపటికి వాయిదా వేసింది. అదే విధంగా రేపటి వరకు ఆ భూముల్లో చెట్లను కొట్టివేయరాదంటూ ఉత్తర్వులు జారీ చేసింది.






