- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవతార్ సినిమాను తలపిస్తోన్న HCU ఘటన.. వీడియో వైరల్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని (HCU) కంచ గచ్చిబౌలిలో గల 400 ఎకరాల భూముల వ్యవహరంలో తీవ్ర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని (HCU) కంచ గచ్చిబౌలిలో గల 400 ఎకరాల భూముల వ్యవహరంలో తీవ్ర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని వేలం వేసేందుకు సిద్ధమవ్వగా.. విద్యార్థులు, అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే, అర్థరాత్రి సమయంలో JCBలతో ఆ భూమిని చదును చేయిస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోలో గుంపులు గుంపులుగా జింకలు పరిగెత్తటం, నెమళ్ల హాహాకారాలు చేస్తున్నట్లు ఉంది. నిజానికి ఈ వీడియో తర్వాతే HCU అంశం మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ నేపథ్యంలో HCU భూముల వివాదంపై విద్యార్థుల ఆందోళనకు ప్రతిపక్షాలు, సెలెబ్రెటీలు, సామాన్య ప్రజలు సైతం మద్దతు పలుకుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవ వైవిధ్యాన్ని దెబ్బతిస్తోందని, పచ్చటి చెట్లను నరికివేస్తోందని, వన్య ప్రాణులకు తమ ఇంటిని దూరం చేస్తుందంటూ ఆరోపిస్తున్నారు. అలాగే, ప్రభుత్వ చర్యను ఖండిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఘటన 2009లో వచ్చిన హాలివుడ్ సినిమా అవతార్‌ను తలపిస్తోందంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
ఈ సినిమాలో భూమిపై నుంచి వెళ్లిన శాస్త్రవేత్తలు పండోరా గ్రహంలోని విలువైన ఖనిజాల కోసం ఆ గ్రహాన్ని ఆక్రమించుకోవాలనుకుంటారు. ఇందుకోసం ఆ గ్రహంలో నివసిస్తున్న అవతార్లపై యుద్దం చేస్తారు. బాంబులు విసిరి అక్కడున్న చెట్లను నాశనం చేస్తారు. ఫలితంగా వారు అక్కడి నుంచి వెళ్లిపోతారని, ఆ దాడిలో వారు కూడా చనిపోతారని భావిస్తారు. ఇప్పుడు HCU ఘటన కూడా అలాగే ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అక్రమార్జనకు తెరతీసిందంటూ ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.






