HCUను కాపాడుకుంది Gen Z యువతే..! కేటీఆర్ హాట్ కామెంట్స్

by Ramesh Naini |   (  Updated:2025-09-20 13:09:43  IST  )

హైదరాబాద్‌లోని HCUను కాపాడుకుంది Gen Z యువతే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు.

HCUను కాపాడుకుంది Gen Z యువతే..! కేటీఆర్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని HCUను కాపాడుకుంది Gen Z యువతే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) హాట్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముంబాయిలో ఎన్‌డీటీవీ (NDTV) యువ కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం (HCU University) హెచ్‌సీయూ యూనివర్సిటీలోని 400 ఎకరాల భూమిని వేలం వేస్తుంటే, ఆ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలు తెలిపి, సోషల్ మీడియాలో యుద్ధం చేసి ఆ భూములను కాపాడారని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో భారత ప్రభుత్వం విఫలమైతే.. నేపాల్‌ లాంటి తిరుగుబాటు కచ్ఛితంగా వస్తుందని కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, యువత గొంతుని అణచివేయడం వల్లే.. నేపాల్‌ జెన్-జెడ్ సర్కార్‌కి వ్యతిరేకంగా ఆందోళన చేశారని తెలిపారు. సోషల్ మీడియాని బ్యాన్‌పై నిరసన చేశారని ప్రచారం చేశారు కానీ.. తమ హక్కు, భవిష్యత్తు కోసం వాళ్లు పోరాడారని చెప్పుకొచ్చారు.

అలాగే గత పదేళ్లలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్‌గా అభివృద్ధి చెందిందని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణలో నిర్మించామని చెప్పారు. ఇండియా ఎందుకు అలా అభివృద్ధి చెందకూడదు? అని ప్రశ్నించారు. చైనా, జపాన్ దేశాలు భారత్ కంటే వెనకబడి ఉండేవి, కానీ నేడు ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నాయని అన్నారు. అన్ని రకాల విపత్తులను తట్టుకొని, చైనా జపాన్ దేశాలు అంత వేగంగా అభివృద్ధి చెందినప్పుడు ఇండియా ఎందుకు అభివృద్ధి చెందలేదు? అని కేటీఆర్ ప్రశ్నించారు.

Next Story