- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఐడీ కస్టడీకి HCA కేసు నిందితులు
హెచ్‌సీఏ కేసులో నిందితులను మల్కాజిగిరి కోర్టు కస్టడీకి అనుమతించింది. ఈ నెల 22 వరకు ఐదుగురు నిందితులను కస్టడీకి అనుమతించగా, రేపు ఉదయం చర్లపల్లి జైలు నుండి నిందితులను

దిశ, వెబ్ డెస్క్: హెచ్‌సీఏ కేసులో నిందితులను మల్కాజిగిరి కోర్టు కస్టడీకి అనుమతించింది. ఈ నెల 22 వరకు ఐదుగురు నిందితులను కస్టడీకి అనుమతించగా, రేపు ఉదయం చర్లపల్లి జైలు నుండి నిందితులను సీఐడీ కస్టడీలోకి తీసుకోనుంది. కస్టడీకి తీసుకుంటే HCAలో జరిగిన అవకతవకలకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నిందితులు వేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇదిలా ఉంటే HCA, SRH వివాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నకిలీ పత్రాలతో జగన్మోహన్ రావు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేసినట్టు సీఐడీ విచారణలో తేలింది. నకిలీ పత్రాలతో ఏర్పాటు చేసిన క్లబ్ ద్వారానే HCAలో అధ్యక్షుడిగా పోటీ చేసినట్టు గుర్తించారు. గౌలిపుర క్రికెట్ క్లబ్ బీఎన్ అధ్యక్షుడు సీ. కృష్ణ యాదవ్ సంతకాన్ని జగన్ మోహన్ రావు ఫోర్జరీ చేసినట్టు సీఐడీ గుర్తించింది.






