Hayath Nagar: హయత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఉద్రిక్తత.. పోలీసులపై దాడి

by Ramesh Goud |

హయత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Hayath Nagar: హయత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఉద్రిక్తత.. పోలీసులపై దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: హయత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ కేసు విషయంలో మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లి మరి పోలీసులపై దాడికి దిగారు. ఈ దాడిలో పోలీసులకు గాయాలు అయ్యాయి. అంతేగాక అనుమానితుడుగా భావించి అరెస్ట్ చేసిన వ్యక్తిని సైతం స్టేషన్ లోనే చితక బాదారు. కాగా హయత్‌నగర్‌ బంజారా కాలనీలో గత రాత్రి ఓ వివాహిత అనునాస్పదంగా మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితుడు కింద ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దీనిపై మృతురాలి బందువులు హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పీఎస్‌ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సహనం కోల్పోయి ఆవేశంతో పీఎస్‌లోకి దూసుకెళ్లి పోలీసులపై దాడికి దిగారు.

Next Story