- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG News : అమరుల కుటుంబాన్ని ఎప్పుడైనా పరామర్శించారా? : భట్టికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రశ్న
ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఒక్క తెలంగాణ ఉద్యమ అమరుల కుటుంబాన్ని పరామర్శించారా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు(MLC Shambipur Raju) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను(Bhatti Vikramarka) ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్ : ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఒక్క తెలంగాణ ఉద్యమ అమరుల కుటుంబాన్ని పరామర్శించారా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు(MLC Shambipur Raju) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను(Bhatti Vikramarka) ప్రశ్నించారు. రాష్ట్రంలో కాకపోయినా కనీసం మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మంలో, మీ నియోజవర్గం లో కానీ ఒక్క కుటుంబం దగ్గరకు అయినా వెళ్ళారా? అని అడిగారు. అమరవీరుల సంగతి పక్కన బెట్టండి కనీసం వేలాది మంది రైతులు ఆత్మ హత్య చేసుకుంటే కనీసం మీరు పరామర్శించార, పరిహారం అయినా ఇచ్చారా? అంటూ నిలదీశారు.
కాని ఇవ్వాళా మీ తోటి తెలంగాణ బిడ్డ ఉద్యమ నాయకుడిపై కొన్ని నీతి నియమాలు లేని తెలంగాణ వ్యతిరేఖ శక్తులు మీడియా ముసుగులో అడ్డగోలుగా వ్యక్తిత్వ హనానికి పాల్పడుతుంటే ఖండించాల్సిన మీరు హుటాహుటిన మహా టివి ఆఫీస్ కి పరిగెత్తడం తగునా అన్నారు. కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు కానీ కాంగ్రెస్ అంటే బాబు కూటమిలో భాగమని నిరూపించారు శంబీపూర్ రాజు అసహనం వ్యక్తం చేశారు.






