హేట్ స్పీచ్ బిల్లు: జర్నలిస్టులపైనా తీవ్ర ప్రభావం!

by Gantepaka Srikanth |

రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన విద్వేషపూరిత ప్రసంగం, నేరాల నివారణ బిల్లు సోషల్‌మీడియాను కట్టడి చేయడానికేనని స్పష్టం చేస్తున్నది.

హేట్ స్పీచ్ బిల్లు: జర్నలిస్టులపైనా తీవ్ర ప్రభావం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన విద్వేషపూరిత ప్రసంగం, నేరాల నివారణ బిల్లు సోషల్‌మీడియాను కట్టడి చేయడానికేనని స్పష్టం చేస్తున్నది. దీంతో పాటు రాజకీయ పార్టీలు, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాపైనా ప్రభావం పడే అవకాశముంది. వాట్సాప్ గ్రూపులో అడ్మిన్ ఏదైనా పోస్ట్ పెడితే సంబంధిత వ్యక్తిపై మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఇప్పటివరకు ఉండేది. కానీ, ఈ చట్టంతో గ్రూపు సభ్యులపైనా కేసులు నమోదు చేసే అవకాశముంది. ప్రభుత్వంపై, అధికారులపై వార్తలు రాసినా విద్వేషపూరిత నేరం కిందనే వస్తుంది. దీంతో జర్నలిస్టులపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.

బిల్లులోని కీలక అంశాలు..

‘డిజిటల్, సామాజిక మాధ్యమాల్లో విద్వేశపూరిత ప్రసంగాల కారణంగా నేరాలు పెరుగుతున్నాయి. వీటి కారణంగా ప్రజాశాంతికి, సామాజిక సామరస్యానికి హాని కలిగే అవకాశముంది. మతం, కులం, లింగం, భాష, ఇతర గుర్తింపు ఆధారంగా వ్యక్తులు, సమూహాల మధ్య శత్రుత్వం, ద్వేషం, విభేదాలను ప్రోత్సహించడంతో పాటు గౌరవాన్ని దెబ్బతీసేలా ఉంటే దీనికి కారణమైన వారిని శిక్షించడంతో పాటు నివారించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బాధితులకు నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు ద్వేశపూరిత నేరం చేసిన వ్యక్తికి ఏడాది నుంచి ఏడేండ్ల పాటు జైలు శిక్ష.. రూ.50వేల జరిమాన విధించే అవకాశం ఉంటుంది. రెండోసారి కూడా ఇలాంటి నేరం చేస్తే రెండేండ్ల నుంచి పదేండ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమాన విధించనున్నారు’ అని చట్టంలో పేర్కొన్నారు.

Next Story