- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒడిశా నుంచి నగరానికి గంజాయి సరఫరా : హాష్ ఆయిల్ స్వాధీనం
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి హాష్ ఆయిల్ ని సరఫరా చేస్తున్న స్మగ్లర్‌ను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం శనివారం పట్టుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి హాష్ ఆయిల్ ని సరఫరా చేస్తున్న స్మగ్లర్‌ను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం శనివారం పట్టుకుంది. నిందితుడి నుంచి హాష్ ఆయిల్ తో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జనగాం ప్రాంతానికి చెందిన సాకి చక్రపాణి (23) అనే యువకుడు గత కొంతకాలంగా ఒడిశా నుంచి ఆయిల్, గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. కుత్బుల్లాపూర్ పరిధిలోని రంగారెడ్డి నగర్‌లో ఆయిల్ అమ్మకాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ బి టీమ్ సిఐ సుభాష్ చందర్ తన సిబ్బందితో కలిసి నిఘా పెట్టారు. శనివారం తనిఖీలు నిర్వహిస్తుండగా చక్రపాణి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా భారీ మొత్తంలో హషీష్ ఆయిల్ బయటపడింది. నిందితుడు చక్రపాణిపై గతంలోనే ఒడిశాలోని కలిమెలా, ఆంధ్రప్రదేశ్‌లోని మోటుగూడ, హైదరాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్లలో డ్రగ్స్ సరఫరాకు సంబంధించి కేసులు నమోదై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తదుపరి చర్యల నిమిత్తం కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.






