ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు హర్యానా ఎమ్మెల్యే మద్దతు.. కాంగ్రెస్‌పై హాట్ కామెంట్స్

by Ramesh Naini |

బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత చేస్తున్న 72 గంటల దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది.

ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు హర్యానా ఎమ్మెల్యే మద్దతు.. కాంగ్రెస్‌పై హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) చేస్తున్న 72 గంటల దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం హైదరాబాద్‌లోని ధర్నాచౌక్ వద్ద సోమవారం ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష (hunger strike) చేపట్టారు. ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు సంఘీభావంగా మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనువడు, ఐఎన్ఎల్‌డీ నేత, హర్యానా ఎమ్మెల్యే అర్జున్ సింగ్ చౌతాలా (Arjun Chautala) హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి సలాం అంటూ కొనియాడారు. ఒక వ్యక్తి, ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా కవిత పోరాటం చేయడం లేదని, ఒక న్యాయమైన డిమాండ్ కోసం ఆమె పోరాడుతున్నారని తెలిపారు.

ఎమ్మెల్సీ కవిత పోరాటంలో మేము భాగస్వాములవుతామని స్పష్టం చేశారు. కవిత ఢిల్లీలో పోరాడినా.. హైదరాబాద్‌లో పోరాడినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దేశంలో వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో (Congress) కాంగ్రెస్ పార్టీ ఒక జబ్బు వంటిదని, ఆ జబ్బును నయం చేయాల్సిన అవసరం ఉందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకిలించాలని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేయడం మానుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

Next Story