TG News : తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ను కలిసిన హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ

by Muthe.Rajitha |

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Telangana Governor Jishnu Dev Varma)ను సోమవారం హరియాణా గవర్నర్, సీనియర్ బీజేపీ నాయకుడు (Haryana Governor Bandaru Datthatreya)బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

TG News : తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ను కలిసిన హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Telangana Governor Jishnu Dev Varma)ను సోమవారం హరియాణా గవర్నర్, సీనియర్ బీజేపీ నాయకుడు (Haryana Governor Bandaru Datthatreya)బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ, తన ఆత్మకథ పుస్తకం(Autobiography) తెలుగు వెర్షన్ “ప్రజల కథే నా ఆత్మకథ”ను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు అందించారు. ఈ సందర్భంగా తన ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావాలని దత్తాత్రేయ జిష్ణుదేవ్ వర్మను ఆహ్వానించారు. ఈ పుస్తకం తన రాజకీయ, సామాజిక జీవితంలోని అనుభవాలు, తెలంగాణ ఉద్యమంలో పాత్ర, తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణ కోసం చేసిన కృషిని వివరిస్తుందని అన్నారు.

ఈ ఆత్మకథ ఇంగ్లీష్ వెర్షన్ “జనతా కీ కహానీ – మేరీ ఆత్మకథ” పేరుతో గతంలోనే భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ఆవిష్కరించారు. తాజాగా తెలుగు వెర్షన్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ సమావేశంలో ఇద్దరు గవర్నర్‌లు తెలంగాణ, హరియాణా రాష్ట్రాల సాంస్కృతిక, అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

Next Story