- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ.. తన ఆత్మకథ పుస్తకావిష్కరణకు ఆహ్వానం
by Ramesh Naini |
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కలిశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Haryana Governor Bandaru Dattatreya) కలిశారు. ఆదివారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కూతురు బండారు విజయలక్ష్మి తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లో జరిగే తన (Autobiography) ఆటోబయోగ్రఫీ తెలుగు వెర్షన్ “ప్రజల కధే నా ఆత్మ కథ” పుస్తకావిష్కరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దత్తాత్రేయ ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సీఎంకు శాలువతో సత్కరించి, ఆహ్వాన పత్రికను అందజేశారు. అదేవిధంగా సీఎం సైతం బండారు దత్తాత్రేయను శాలువాతో సత్కరించారు. కాగా, ఇటీవల ఢిల్లీలో బండారు దత్తాత్రేయ ఆత్మకథ హిందీ వెర్షన్ “Janata Ki Kahani, Meri Aatmakatha” విడుదల చేసిన విషయం తెలిసిందే.
Next Story






