Harsh Goenka: ఏఐతో ఉద్యోగాల ముప్పు?.. హర్ష్ గోయెంకా ట్వీట్ వైరల్

by Prasad Jukanti |   (  Updated:2025-08-06 12:27:28  IST  )

ఏఐతో ఉద్యోగాల ముప్పు పై హర్ష్ గోయెంకా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Harsh Goenka: ఏఐతో ఉద్యోగాల ముప్పు?.. హర్ష్ గోయెంకా ట్వీట్ వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న కృత్రిమ మేధ (ఏఐ)తో తలెత్తబోయే ఉద్యోగాల ముప్పు విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏఐ ప్రభావం ఎలా ఉండబోతున్నదనే దానిపైనే అందరిలో చర్చ జరుగుతోంది. ఏఐ విషయంలో ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్న తరుణంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా ఎక్స్ లో ఏఐపై (AI) ఇంట్రెస్టింగ్ పోస్టు చేశారు. ఎప్పుటికప్పుడు ఆసక్తికర అంశాలతో నెటిజన్లను ఆలోచింపచేసే హర్ష్ గొయెంకా (Harsh Goenka) చేసిన తాజా ట్వీట్ వైరల్ గా మారింది. ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయా అనే ప్రశ్నకు ఎక్స్ వేదికగా హర్ష్ గొయెంకా వివరణ ఇస్తూ ఏఐ ఉద్యోగాలు తొలగిచందని అభిప్రాయపడ్డారు. ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందనే అంతా ఆందోళన చెందుతున్నారు. కానీ ఏఐ ప్రస్తుతం జరుగుతున్న పనిని మార్చేసి అందులో కొత్తదనం తీసుకువస్తుంది. భవిష్యత్ లో ప్రాంప్ట్ ఇంజినీర్లు, ఏఐ ప్రొడక్ట్ మేనేజర్లు, ఏఐ విలువల నిపుణులు వంటి కొత్త ఉద్యోగాలు పుట్టే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం ఉన్న వాటిలో కాకుండా ఆఫీస్ రూపురేఖలు కూడా మారే అవకాశం ఉందన్నారు. ఎవరైతే స్మార్ట్ వర్క్ చేసే వారు ఉంటారో అలాంటి వారే బాగా రాణిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story