సీఎం రేవంత్​ రెడ్డి ఆరోపణలపై హరీశ్​రావు స్ట్రాంగ్ కౌంటర్

by Muthe.Rajitha |

సీఎం రేవంత్ రెడ్డి SLBC టన్నెల్ ప్రమాదస్థలి వద్ద తనపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా స్పందించారు.

సీఎం రేవంత్​ రెడ్డి ఆరోపణలపై హరీశ్​రావు స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి SLBC టన్నెల్ ప్రమాదస్థలి వద్ద తనపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంలో ఉంది రేవంత్​ రెడ్డా తానా అంటూ సీఎంపై మండిపడ్డారు. ఎస్ఎల్​బీసీ ప్రమాదం జరిగినప్పుడు తాను దుబాయ్​ అబుదాబిలో ఉన్నట్లుగా సీఎం వ్యాఖ్యలు మోకాలికి బోడి గుండుకు ముడివేసి నట్లుగా ఉన్నాయని అన్నారు. సీఎం రేవంత్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్​ రావు ఎక్స్​లో స్పందించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ ​రెడ్డి కూతురు పెళ్లి ఫంక్షన్ కోసం అబుదాబి వెళితే దాన్ని వివాదం చేయడానికి ప్రయత్నించడం అతని నీచత్వానికి పరాకాష్ట ఆయన విమర్శించారు.

ప్రభుత్వాన్ని నడుపుతున్నది రేవంత్​రెడ్డి అని, ప్రమాద స్థలానికి వెంటనే వెళ్ళవలసింది సీఎం అని, తను బాధ్యత మరిచి ఎలక్షన్ ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు ప్రతిపక్షం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. తాను అబుదాబికి వెళ్ళింది క్రికెట్ మ్యాచ్లు చూడడానికో, విహారయాత్రలకు, విలాసాలకో కాదని వివరణ ఇచ్చారు. తాను వెళ్ళింది ఫిబ్రవరి 21న అని, ప్రమాద ఘటన జరిగింది 22న అని, ఆ రోజున హెలికాఫ్టర్ తీసుకొని ప్రమాద స్థలానికి రాకుండా ఎన్నికల ప్రచారానికి పోయింది ఎవరు? ప్రమాద స్థలానికి చేరుకోవడానికి హెలికాప్టర్ లేదని నీటిపారుదల శాఖ మంత్రి పోకుండా హైదరాబాదులో ఉన్నాడన్నారు. తక్షణ కర్తవ్యం విస్మరించిన ముఖ్యమంత్రి ఇప్పుడు తగుదునమ్మా అని తొమ్మిది రోజుల తర్వాత పోయి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు.

Next Story