- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రొ.నాగేశ్వర్‌కు మద్దతుగా బీఆర్ఎస్.. తెలంగాణ వర్సెస్ ఏపీ నెటిజన్ల మధ్య 'సోషల్' వార్!
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుపై ఏపీలో కేసులు పెట్టడంపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. నాగేశ్వర్ వ్యాఖ్యల పట్ల నెట్టింట తెలంగాణ వర్సెస్ ఏపీగా వివాదం ముదురుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొపెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్‍లో కేసులు నమోదు కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ మొదలైంది. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా కేసులు పెట్టడంపై నాగేశ్వర్‍కు మద్దతుగా పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు సైతం ప్రొ.నాగేశ్వర్ కు మద్దతుగా నిలిచారు. నాగేశ్వర్ తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ కక్షపూరిత ధోరణితో కేసులు నమోదు చేసి వేధించడం సరికాదంటూ ట్వీట్ చేశారు. వెంటనే ఈ కేసులను ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నానంటూ ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంను ట్యాగ్ చేశారు.
తెలంగాణ వర్సెస్ ఏపీ:
ఈ వ్యవహారంపై నెటిజన్ల మధ్య తెలంగాణ వర్సెస్ ఏపీగా విడిపోయి సోషల్ వార్‍కు తెరలేపారు. తెలంగాణకు చెందిన నాగేశ్వర్‍కు ఏపీ రాజకీయాలతో పనేముందని ఏపీ నెటిజన్లు ప్రశ్నిస్తుండగా, తెలంగాణ వాళ్ల జోలికి వస్తే ఆంధ్ర నాయకులను హైదరాబాద్‍లో తిరగనివ్వకుండా చేస్తామంటూ తెలంగాణ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నాగేశ్వర్ బీఆర్ఎస్ మీద చాలా సార్లు తప్పుడు ప్రచారం చేసినా మేము ఒక్క మాట మాట్లాడలేదని కేవలం టీవీ చానల్‍లో ఒక మాట అంటే ఆయన మీద ఏపీలో 3 కేసులు పెడతారా అంటూ నిలదీస్తున్నారు. అధికారంలోకి రాగానే కొన్ని ఛానెళ్ళని, పేపర్లని అనధికారంగా బ్యాన్ చేసిన బీఆర్ఎస్ పార్టీ నీతులు చెప్పకూడదు అంటూ ఏపీ నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. నాగేశ్వర్‍పై ఏపీలో కేసులు పెట్టడంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సహా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండగా తాజాగా ఈ వ్యవహారం తెలంగాణ వర్సెస్ ఏపీగా టర్న్ అవుతుండటంతో ఈ అంశం ఇప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయంగా దుమారం రేపుతోంది. అంతింమంగా ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.






