ఆ కేసులు ఉపసంహరించుకోండి: మాజీ మంత్రి హరీశ్ రావు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-24 12:02:29  IST  )

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కూటమి ప్రభుత్వంపై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. వైసీపీ అధినేత జగన్‌ను అరెస్ట్ చేయాలని పవన్ కల్యాణ్ అమిత్ షాను కోరినట్లు ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది..

ఆ కేసులు ఉపసంహరించుకోండి: మాజీ మంత్రి హరీశ్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan), కూటమి ప్రభుత్వం(Kutami Government)పై ప్రొఫెసర్ నాగేశ్వర్(Professor Nageswar) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. వైసీపీ అధినేత జగన్‌(Ycp Chief Jagan)ను అరెస్ట్ చేయాలని పవన్ కల్యాణ్ అమిత్ షాను కోరినట్లు ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ వైసీపీకి తొత్తుగా మారాడంటూ విమర్శలు చేసింది. సోషల్ మీడియాలో ఏకిపారేసింది. అంతేకాదు ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై రాష్ట్రంలో పలువురు జనసేన నేతలు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ అధినేతను కించపర్చేలా నాగేశ్వర్ మాట్లాడారని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు

దీంతో ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై పలు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఏపీ, తెలంగాణలో రాజకీయ దుమారం చెలరేగింది. ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు పలువురు మద్దతిస్తుంటే కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. దీంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అయినా సరే ఆయనపై కేసులు మాత్రం వెనక్కి తీసుకోలేదు. దీంతో పలువురు రాజకీయ నేతలు ప్రొఫెసర్ నాగేశ్వర్ పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరుతున్నారు. తాజాగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సైతం స్పందించారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ కక్షపూరిత ధోరణితో కేసులు నమోదు చేసి వేధించడం సరికాదన్నారు. వెంటనే ఈ కేసులను ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నానని హరీశ్ రావు పేర్కొన్నారు. హరీశ్ రావు ట్వీట్‌పై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Next Story