- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారికి దీపావళి పండగ లేకుండా చేయడం దుర్మార్గం.. సర్కార్‌పై హరీష్ రావు ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆదివారం ట్వీట్ పెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆదివారం ట్వీట్ పెట్టారు. గురుకులాలకు నిత్యవసరాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు(Gurukul School Contractors) ఆరు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. నెలల తరబడి బిల్లులు పెండింగ్ పెడితే, గురుకులకు ఆహార పదార్థాలు ఎలా సప్లై చేస్తారు? పిల్లలకు నాణ్యమైన భోజన ఎలా అందిస్తారు? అని ప్రశ్నించారు. కల్తీ ఆహారంతో గురుకుల విద్యార్థులు ఆసుపత్రుల పాలై ప్రాణాలు వదులుతుంటే.. ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం శోచనీయం అన్నారు. గురుకుల విద్యార్థులు పస్తులు ఉండకూడదన్న బాధ్యతతో కాంట్రాక్టర్లు అప్పులు తీసుకొచ్చి మరీ భోజనాలు పెడుతున్నారని తెలిపారు. ఆ అప్పులు క్రమంగా పెరిగి, వారితో పాటు వారి కుటుంబ సభ్యులు ఆర్థిక భారంతో సతమతమవుతున్నాయని అన్నారు.
సుమారు 5000 మంది సరఫరాదారులకు బతుకమ్మ, దీపావళి పండగ సంబరం లేకుండా చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అధికారులను కలిసి బిల్లులు చెల్లించాలని గోడు వెళ్లబోసుకుంటున్నా ప్రభుత్వంలో కదలిక లేదని విమర్శించారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆరు నెలలుగా ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, గురుకుల పిల్లలకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.






