- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీలు అంటూ గొప్పలు చెప్పి.. అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. ఈ విషయం ప్రజల్లో సైతం జ్ఞానోదయం అయిందని తెలిపారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నాయి.. ఆగష్టు నెల కూడా కానీ ఇంకా రైతుబంధు డబ్బులే రాలేదని అన్నారు. మరోవైపు రైతు భరోసా ఊసే లేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులను గాలికి వదిలేశారని అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు అంటూ, జాబ్ క్యాలెండర్ అంటూ ఎన్నో బూటకపు మాటలు చెప్పారని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, యువత, మహిళలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం అందరినీ మోసం చేసిందని అన్నారు. బీజేపీతో కలిసి కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని కీలక ఆరోపణలు చేశారు.






