- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అరాచకానికి అధికారం తోడైతే ఇలాగే ఉంటుందేమో’.. రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ఫైర్..
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘‘ప్రజా పాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండకు నల్గొండ జిల్లాలో జరిగిన ఘటన మరో నిదర్శనం. యూరియా కావాలంటూ ధర్నాలో పాల్గొనడమే ఈ గిరిజన యువకుడు చేసిన పాపమా?, కులం పేరుతో దూషిస్తూ పోలీసు స్టేషన్‌కు లాక్కెళ్లి, కాళ్లు.. చేతులు కట్టేసి లాఠీలతో బాదడమేనా.. ప్రజాస్వామ్యం?, యూరియా అడిగిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేనా.. ఇందిరమ్మ రాజ్యం?, రేవంత్ రెడ్డికి అధికారం రావడం అంటే.. అరాచకానికి అధికారం తోడైనట్లుంది. ప్రశ్నిస్తే దాడులు, నిలదీస్తే కేసులు, అక్రమంగా అరెస్టులు.. పాలన గాలికి వదిలేసి 22నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఇదొక్కటే కదా?. లాఠీ దెబ్బలకు నడవలేని స్థితికి చేరుకున్న ఆ యువకుడి భవిష్యత్తుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. థర్డ్ డిగ్రీ ప్రయోగించి, గిరిజన బిడ్డ పట్ల కర్కశంగా వ్యవహరించిన పోలీసులపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలి’’ అని ఎక్స్ వేదికగా హరీష్ రావు డిమాండ్ చేశారు.






