- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Harish Rao: నా టార్గెట్ సీఎం
అపెక్స్ కౌన్సిల్‌కు సంబంధించి నిర్ణయం తీసుకునేది రాష్ట్ర సీఎంగా రేవంత్‌రెడ్డిదేనని.. అందుకే తన టార్గెట్ సీఎం రేవంత్ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: అపెక్స్ కౌన్సిల్‌కు సంబంధించి నిర్ణయం తీసుకునేది రాష్ట్ర సీఎంగా రేవంత్‌రెడ్డిదేనని.. అందుకే తన టార్గెట్ సీఎం రేవంత్ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు వెల్లడించారు. శనివారం బనక్కచర్లపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ అనంతరం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన అప్పులపై త్వరలోనే మరో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. త్వరలో కాళేశ్వరంలో ఉన్న అన్ని విభాగాల వద్దకు వెళ్లి ప్రజలకు అన్ని విషయాలను వివరిస్తామని చెప్పారు. మీడియాతో కలిసి కాళేశ్వరం సందర్శిస్తామని వెల్లడించారు. గోదావరి పరివాహక రైతులతో, ప్రజలతో కలిసి తెలంగాణకు అన్యాయం చేసే బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. బనకచర్లపై ప్రాజెక్టుపై బీజేపీ మాట్లాడే పరిస్థితి లేదని.. ఎన్‌డీఏ ప్రభుత్వం చంద్రబాబుపై ఆధారపడి ఉండడంతో వారు సైలెంటుగా ఉండిపోయారని అన్నారు. గురు దక్షిణగా చంద్రబాబుకు, బనకచర్లకు వ్యతిరేకంగా రేవంత్ మాట్లాడటం లేదన్నారు. తన సొంత స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు ఫణంగా పెడితే రాష్ట్ర చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని అన్నారు. కాళేశ్వరానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బయటపెడుతానని సీఎం అంటున్నానని.. రేవంత్ డాక్యుమెంట్లు బయట పెట్టగానే.. నిమిషాల వ్యవధిలో తాను మరికొన్ని డాక్యుమెంట్లు బయటపెడుతా అని హెచ్చరించారు.






