రెండు గ్రూపులుగా విడిపోయిన తెలంగాణ మంత్రులు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

రెండు గ్రూపులుగా విడిపోయిన తెలంగాణ మంత్రులు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) దండుపాళ్యం ముఠాలా తయారైందని విమర్శించారు. నీటి వాటాల కోసం కేసీఆర్‌ పోరాడితే.. వసూళ్లలో వాటాల కోసం కాంగ్రెస్‌ నేతలు పోరాటం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రులు ఒకరినొకరు తిట్టుకోవడానికే కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ కేబినెట్‌ గ్రూపులుగా విడిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తెలంగాణలో రేవంత్‌ రెడ్డి గన్ కల్చర్ తీసుకొచ్చారని మండిపడ్డారు. రేవంత్ సన్నిహితులు తుపాకీ పెట్టి బెదిరించినట్టు.. మంత్రి కొండా సురేఖ కూతురు ఆరోపించారు. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని హరీష్‌ రావు డిమాండ్ చేశారు. టెక్ మహేంద్ర సీఈఓ వచ్చినప్పుడు వర్షం పడుతుంటే తానే గొడుగు పట్టి వ్యాపారవేత్తలను ఆహ్వానించిన సంస్కృతి బీఆర్ఎస్‌ది అని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి పెట్టుబడులు తగ్గిపోయాయని చెప్పారు.

Next Story