TG: వృద్ధ రైతుపై చేయి చేసుకున్న ASI సస్పెండ్..

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-04 11:42:13  IST  )

నిర్మల్ జిల్లా ఖానాపూర్(Khanapur incident) మండలం పాత ఎల్లాపూర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది.

TG: వృద్ధ రైతుపై చేయి చేసుకున్న ASI సస్పెండ్..
X

దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా ఖానాపూర్(Khanapur incident) మండలం పాత ఎల్లాపూర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు, భూభారతి సదస్సులో తన సమస్య చెప్పుకునేందుకు ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చాడు. దీంతో ఓ ఏఎస్ఐ కనికరం లేకుండా దౌర్జన్యంగా రైతును ఎమ్మార్వో ఆఫీసు నుండి ఈడ్చుకెళ్లి పడేశాడు. అక్కడే ఉన్న పలువురు ఇదంతా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త వైరల్ అయ్యింది. తాజాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా హరీష్ రావు(Harish Rao) పోస్టు పెట్టారు.

‘సమస్య చెప్పుకునేందుకు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన వృద్ధ రైతు పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా?. ఇదేనా మీరు చెబుతున్న ప్రజా పాలన. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం పోలీసులకు అవసరమా?. నాడు లగచర్ల లంబాడి రైతన్నల చేతులకు బేడీలు వేశారు?.. నేడు ఖానాపూర్‌లో వృద్ద రైతు మెడలు పట్టి గెంటేశారు. ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదు. ఈ సంగతి మరిచిపోయి ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుపై చేయి వేసిన పోలీసుపై వెంటనే తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలి. బేషరతుగా యావత్ తెలంగాణ రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం’ అని హరీష్ రావు ఎక్స్‌లో పేర్కొన్నారు.

మరోవైపు రైతుతో దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐ రాంచందర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ జానకీ ఉత్తర్వులు జారీ చేసింది.

కట్టెతో ఒక్కటి వేద్దామనుకున్నా..ఏఐఎస్ఐపై తీరుపై బాధిత రైతు ఆగ్రహం

Next Story