Big Debate: అరగంట సమయం ఇచ్చిన స్పీకర్.. 600 పేజీలంటూ హరీష్ రావు సీరియస్

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-31 12:53:05  IST  )

కాళేశ్వరం కమిషన్ నివేదిక(Kaleshwaram Commission Report)పై తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరుగుతోంది.

Big Debate: అరగంట సమయం ఇచ్చిన స్పీకర్.. 600 పేజీలంటూ హరీష్ రావు సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం కమిషన్ నివేదిక(Kaleshwaram Commission Report)పై తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరుగుతోంది. ముందుగా అసెంబ్లీలో కమిషన్ రిపోర్ట్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చ ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద మానవ తప్పిదం అని అన్నారు. అధికారులు, అధికార సంస్థలు వద్దని వారించినా వినిపించుకోకుండా కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారని ఉత్తమ్ చెప్పారు. కాళేశ్వరానికి రూ.80వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టారు. గొప్పగా నిర్మించామని గొప్పలు చెప్పుకున్న కొన్ని రోజులకే మేడిగడ్డ ప్రాజెక్ట్‌ కూలిందని అన్నారు. దాదాపు 20 నెలలు కాళేశ్వరం పంపులు నిరుపయోగంగా ఉండటం బాధాకరం అన్నారు.

అనంతరం సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao)కు అసెంబ్లీ స్పీకర్‌ అవకాశం ఇచ్చారు. అరగంటలో సమాధానం చెప్పాలని అవకాశమిచ్చారు. దీంతో స్పీకర్‌పై హరీష్ రావు ఫైర్ అయ్యారు. 600 పేజీల నివేదికపై అరగంటలో ఎలా సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కనీసం రెండు గంటలు సమయం కావాలని అడిగారు. తాము వెనకడుగు వేయబోమని.. ఎన్ని రోజులైనా కాళేశ్వరంపై చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఆదివారం హడావిడిగా అసెంబ్లీని నడపడం వెనుక కుట్రను ప్రజలు అర్థం చేసుకుంటారని.. కాంగ్రెస్ రాజకీయాలు ప్రజలకు తెలియనివి కాదని అన్నారు. ప్రభుత్వం నడపటం చేతగాక.. సర్కస్ చేస్తున్నారని సీరియస్ అయ్యారు. స్థానిక ఎన్నికల వేళ బుదరజల్లే ప్రయత్నం సరికాదని చెప్పారు.

Read More..

మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. బీఆర్ఎస్ నేతలపై మంత్రి ఉత్తమ్ ఫైర్

Next Story