- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: ఈ రైతుల కన్నీటి దృశ్యమే ప్రత్యక్ష సాక్ష్యం.. హరీశ్ రావు ఆసక్తికర ట్వీట్
నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోస్తున్న కాంగ్రెస్ సర్కారు దుర్మార్గ వైఖరిని యావత్ తెలంగాణ గమనిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోస్తున్న (Congress) కాంగ్రెస్ సర్కారు దుర్మార్గ వైఖరిని యావత్ తెలంగాణ గమనిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన రైతు దంపతులు బొల్లం రామయ్య, చంద్రకళ ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోందని ఎక్స్ వేదికగా స్పందించారు. అకాల వర్షాలు, సాగు నీటి గోస, కరెంట్ కష్టాలను ఎదుర్కొని కౌలుకు తీసుకున్న 18 ఎకరాల్లో వరి సాగు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ రూపంలో విపత్తు రైతన్నను నట్టేట ముంచిందన్నారు. కొండంత సంబురంతో పంటను కొనుగోలు కేంద్రానికి తరలించి 20 రోజులు గడిచినా ప్రభుత్వం పంట కొనుగోలు చేయలేదన్నారు. దీంతో అకాల వర్షం ఆ రైతన్నను నిండా ముంచిందని, కష్టపడి పండించిన ధాన్యమంతా తడిసి ముద్దయిందన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనకపోగా, పరిహారం కూడా చెల్లించకపోవడంతో తడిసిన ధాన్యం రాశి ముందు రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని చెప్పడానికి ఈ రైతుల కన్నీటి దృశ్యమే ప్రత్యక్ష సాక్ష్యమని తెలిపారు. రైతుల జీవితాల్లో కాలం తెచ్చిన విపత్తు కాదు, కాంగ్రెస్ తెచ్చిన విపత్తు ఇదన్నారు. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారని, కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారని, కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా నేడు అకాల వర్షాలపాలు చేసి ఆగం చేస్తున్నారని ఆరోపించారు. మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ పాలకులారా రైతన్న గోస ఇకనైనా పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదని గుర్తుకు పెట్టుకోవాలని సూచించారు. మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read..
ప్రభుత్వాన్ని కూల్చేందుకు డబ్బులిస్తామంటుండ్రు.. దుబ్బాక ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు






