- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Water war: బీఆర్ఎస్ మీకు తోడుగా ఉంది.. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి హరీశ్‌రావు కీలక లేఖ
రాష్ట్ర నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ మీకు తోడుగా నిలుస్తుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి భరోసా ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ మీకు తోడుగా నిలుస్తుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వానికి భరోసా ఇచ్చారు. ఈ మేరకు గోదావరి బనకచర్ల అంశంపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy)కి ఇవాళ (ఆదివారం) హరీశ్ రావు లేఖ రాశారు. (Godavari- Banakacherla) గోదావరి- బనకచర్ల లింక్ ప్రాజెక్టు వల్ల గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులకు తీవ్ర నష్టం కలుగుతుందని హరీశ్‌రావు హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 200 టీఎంసీల గోదావరి నీటిని బనకచర్ల వరకు తరలించేందుకు మూడు దశల్లో ప్రాజెక్టు డిజైన్, కేంద్రానికి పీఎఫ్ఆర్(ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్) సమర్పించడం తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమేనని తెలిపారు. ఈ ప్రాజెక్టును కేంద్రం ఆమోదించేలోపే, తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రావాల్సి ఉండగా, ఏపీ యూనిలేటరల్‌గా ముందుకెళ్తుండటం అన్యాయమన్నారు. ఏపీ తీసుకుంటున్న చర్యలు 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంతో పాటు నదీ జలాల బోర్డుల నియమాలను ఉల్లంఘించడమేనని వివరించారు.
వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి జలాల్లో 969 టీఎంసీల తెలంగాణ వాటాలో ఇప్పటివరకు వినియోగం 600 టీఎంసీలకు పెరిగిందన్నారు. గోదావరి నదిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ, సీతమ్మసాగర్, సమ్మక్కసాగర్ వంటి బ్యారేజులు, 19 లక్షల ఎకరాల స్థిరీకరణతో గోదావరి బేసిన్ అభివృద్ధి.. చెరువులు, చెక్ డ్యాములు, మిషన్ కాకతీయ, కాల్వల ద్వారా గోదావరి నీటిని వ్యవస్థీకృతంగా వినియోగంలోకి తేవడం జరిగిందని తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల అదనపు నివేదిక, సమ్మక్కసాగర్, వార్ధా (బీఆర్ అంబేద్కర్ ప్రాజెక్టు) తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్‌లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇక, పోలవరం ద్వారా 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకు తరలించినట్లయితే.. తెలంగాణకు కృష్ణా జలాల్లో అదనంగా 157.5 టీఎంసీలు హక్కుగా లభించాల్సిన వాటా అని తెలిపారు.
ఈ 157.5 టీఎంసీలను నికర జలాల కేటాయింపులులేని పాత ప్రాజెక్టులకు వాడుకునే వెసులుబాటు తెలంగాణకు కలుగుతుందన్నారు. ఎస్ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు నీటిని వినియోగించుకోవచ్చన్నారు. ఏపీ వానాకాలపు వరదజలాలే తరలిస్తామన్నప్పటికీ, గోదావరి ట్రిబ్యునల్ అవార్డ్ లో “all waters” అనే పదమే ఉన్నదని నిపుణుల అభిప్రాయం అని తెలిపారు. అదనపు జలాలు అనే అంశం గోదావరి అవార్డులో లేదన్నారు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణకు ఈ 157.5 TMCల అదనపు వాటాను కోరాలని, న్యాయ నిపుణులతో చర్చించి తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు. ఏపీ ఈ హక్కులకు అంగీకరిస్తే గోదావరి-బనకచర్ల లింక్ పై తెలంగాణ సానుకూలంగా పరిశీలించవచ్చని ఇంజనీర్ నిపుణులు సూచనలు చేసినట్లు వెల్లడించారు.






