- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆడంబర ప్రకటనలు వద్దు.. CM రేవంత్‌కు హరీష్ రావు సూచన
ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆడంబరంగా ప్రకటనలు చేయడం కాదని.. ముందు వారికి సకాలంలో జీతాలు చెల్లించు రేవంత్‌రెడ్డి అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్’లో సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆడంబరంగా ప్రకటనలు చేయడం కాదని.. ముందు వారికి సకాలంలో జీతాలు చెల్లించు రేవంత్‌రెడ్డి అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్’లో సూచించారు. కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయమని పేర్కొన్నారు. విష జ్వరాలు, పాముకాట్లు, ఎలుక కాట్లు, కుక్కకాట్లు, ఫుడ్ పాయిజనింగ్ తో విద్యార్థులు ఆస్పత్రుల పాలై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాపురించిందని తెలిపారు. గురుకులాల్లో పనిచేస్తున్న 2,500 మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఇక నుంచి తానే స్వయంగా గురుకులాలను పర్యవేక్షిస్తానన్న సీఎం మాటలు నీటి మూటలు అయ్యాయని ఎద్దేవా చేశారు. కల్తీ ఆహారం పెడితే జైలుకే అని ఇచ్చిన ప్రకటనలు గాలి మాటలయ్యాయని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో గురుకుల విద్యావ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిస్తే.. రేవంత్ పాలనలో నరక కూపాలుగా మారాయని ఆరోపించారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో గురుకులాల ఖ్యాతి అధఃపాతాళానికి దిగజారిందని తెలిపారు. కాంగ్రెస్ అసమర్థత పాలనకు మరో నిదర్శనమని పేర్కొన్నారు. గురుకులాలంటే ఎందుకు అంత చిన్నచూపు రేవంత్‌రెడ్డి అని ప్రశ్నించారు. ఇప్పటికైనా గురుకులాల సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.






