- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంపు.. దుర్మార్గమైన చర్య అంటూ హరీష్ రావు ఫైర్
ఆదాయం సమకూర్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉందని భట్టి చెప్పిన మాటలను రేవంత్‌రెడ్డి ఈ రకంగా నిజం చేసి చూపిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆదాయం సమకూర్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉందని భట్టి చెప్పిన మాటలను రేవంత్‌రెడ్డి ఈ రకంగా నిజం చేసి చూపిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్’లో పేర్కొన్నారు. జీవో 53, 54 లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేశారని.. పన్నుల భారంతో పేదల రక్తం పీల్చే ఎత్తుగడ వేశారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రజలను దొంగ దెబ్బ కొట్టారని పేర్కొన్నారు. ఇప్పటికే ఏ ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలంటే లక్ష దాటిందని.. రైతులు, చిరు వ్యాపారులు ద్విచక్ర వాహనాలను వృత్తి, ఉపాధి పరంగా కొనుగోలు చేస్తుంటారని.. లక్ష దాటిన వాహనాలపై లైఫ్ టాక్స్‌ను 12 శాతం నుంచి 15శాతానికి పెంచడం దుర్మార్గమని పేర్కొన్నారు. బైక్ ఎక్స్ షోరూం ధర లక్షా 10వేలు ఉంటే, ఇప్పటివరకు 13,200 లైఫ్ టాక్స్ కట్టాల్సి ఉండేదని.. తాజా పెంపుతో రూ.16,500లకు పెరుగుతుందని తెలిపారు.
ఇంత పెద్ద మొత్తంలో అదనపు భారాన్ని పేద, మధ్య తరగతి ప్రజలపై కాంగ్రెస్ వేస్తున్నదని పేర్కొన్నారు. కారు కొనుక్కోవాలనే వారి ఆశలపైనా కాంగ్రెస్ నీళ్లు చల్లిందని తెలిపారు. 10-20 లక్షలతో కారు కొంటే 17శాతంగా ఉన్న పన్ను శాతాన్ని 18శాతానికి పెంచారని పేర్కొన్నారు. దాదాపు 20 వేల అధిక భారం కొనుగోలుదారులపై కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్నదని తెలిపారు. కమర్షియల్ వెహికిల్స్‌పై పన్ను పెంచడం వల్ల, చివరకు అది మార్కెట్‌పై, ప్రజలపైనే భారం పడుతుందని పేర్కొన్నారు. హ్యామ్ మోడల్ కోసం రుణాలు సేకరించేందుకు టాక్స్ పెంచడం శోచనీయమని తెలిపారు. బ్యాంకుల వద్ద అణాపైసా అప్పు పుట్టట్లేదని ఆదాయం కోసం పన్నులు విధించటమే మార్గంగా రేవంత్ భావిస్తున్నారని ఆరోపించారు.






